Sandeep Reddy Vanga: సందీప్ తో సల్మాన్ సినిమా.. కుదిరే పనేనా?
రీసెంట్ గా సికందర్(Sikandar) సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న సల్మాన్ ఖాన్(Salman khan) గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావడం లేదు. ఆయన చేసిన ప్రతీ సినిమా ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తూనే ఉంది. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్, అర్జున్ రెడ్డి(Arjun reddy) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ఇప్పుడు సడెన్ గా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
దానికి కారణం సల్మాన్ ఇన్స్స్టాలో షేర్ చేసిన పోస్ట్ ను సందీప్ లైక్ చేయడమే. సాధారణంగా సందీప్ ఎవరి పోస్ట్లకూ లైక్ చేయడు. అలాంటిది సల్మాన్ పోస్ట్ లైక్ చేశాడంటే దానికి కారణం వారద్దరూ కలిసి వర్క్ చేయనుండటమేనని అంటున్నారు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదనేది అందరికీ తెలుసు. ప్రస్తుతం సందీప్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
సందీప్ ముందుగా ప్రభాస్(prabhas) తో స్పిరిట్(Spirit) ను చేయాల్సి ఉంది. స్పిరిట్ తర్వాత రణ్బీర్ కపూర్(ranbir kapoor) తో యానిమల్ పార్క్(animal park) ను చేయనున్నాడు. ఆ రెండూ భారీ ప్రాజెక్టులే. ఆ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) తో కూడా సందీప్ సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే సందీప్ కు ఎంత లేదన్నా నాలుగైదేళ్లు పడుతుంది. ఇంతటి బిజీ షెడ్యూల్ లో సందీప్, సల్మాన్ తో సినిమా చేయడం కుదరని పనే.






