Sandeep Reddy Vanga: స్పిరిట్ కోసం మెక్సికోలో సందీప్
యానిమల్(Animal) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తన నెక్ట్స్ మూవీని ప్రభాస్(Prabhas) తో చేయనున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే పేరుతో రూపొందనున్న ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. అమెరికాలో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ ను అక్కడి జనాలు స్పిరిట్ గురించి అడిగారు.
ప్రస్తుతం స్పిరిట్(Spirit) సినిమా కోసం సందీప్ మెక్సికోలో లొకేషన్లను వెతుకేపనిలో బిజీగా ఉన్నానని చెప్పాడు సందీప్. స్పిరిట్ కోసం లొకేషన్లు వెతుకుతున్నానని సందీప్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పటివరకు మెక్సికోలో తెలుగు సినిమా షూటింగులు జరిగింది చాలా తక్కువ. అందుకే ఆడియన్స్ ఈ విషయంలో చాలా ఎగ్జయిటెడ్ గా ఉన్నారు.
ఈ మూవీ కోసం సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేయడానికే సందీప్ మెక్సికోలో లొకేషన్స్ ను వెతుకుతున్నాడని, స్పిరిట్ లో మేజర్ షూటింగ్ ను అక్కడే పూర్తి చేస్తాడని అంటున్నారు. ఆల్రెడీ ఈ మూవీలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఉంటాడని చెప్పి సినిమాపై హైప్ పెంచిన సందీప్ ఇప్పుడు స్పిరిట్ కోసం మెక్సికోలో లొకేషన్లు వెతుకుతున్నానని చెప్పి ఆ హైప్ ను మరింత పెంచేశాడు. చూస్తుంటే స్పిరిట్ కోసం సందీప్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.













