Samyuktha Menon: వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంయుక్త

భీమ్లా నాయక్(Bheemla Nayak) తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త(samyukhtah menon), రెండో సినిమాగా కళ్యాణ్ రామ్(kalyan ram) తో బింబిసార(bimbisara), మూడో సినిమాగా సార్(Sir) సినిమాను చేసి వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకుంది. ఆ తర్వాత నాలుగో సినిమాగా విరూపాక్ష(virupaksha) చేస్తే ఆ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. విరూపాక్ష సినిమాలో ఏకంగా నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీంతో ఒక్కసారిగా సంయుక్త క్రేజ్ బాగా పెరిగిపోయింది. విరూపాక్ష తర్వాత కళ్యాణ్ రామ్ తో డెవిల్(Devil) అనే సినిమా చేస్తే ఆ సినిమా అనుకున్న ఫలితాన్నివ్వలేదు. అయితే డెవిల్ తర్వాత సంయుక్త నుంచి మరో సినిమా వచ్చింది లేదు. 2024 లో అమ్మడి నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితే ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలని సంయుక్త గట్టిగానే ట్రై చేస్తోంది.
ప్రస్తుతం సంయుక్త చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రాజెక్టులున్నాయి. నిఖిల్(nikhil) తో చేస్తున్న స్వయంభు(swayambhu), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai sreenivas) తో చేస్తున్న హైంధవ(Haindhava), బాలకృష్ణ(bala krishna) తో చేస్తున్న అఖండ2(akhanda2) తో పాటూ శర్వానంద్(Sarwanand) తో నారీనారీ నడుమ మురారీ(nari nari naduma murari) చేస్తోంది. వీటితో పాటూ బాలీవుడ్ లో మహారాగ్ని క్వీన్స్ ఆఫ్ క్వీన్స్(Maharagni queens of wueens), మలయాళంలో రామ్(ram) సినిమాల్లో నటిస్తుంది. ఈ ఆరు ప్రాజెక్టుల్లో ఎంతలేదన్నా ఈ ఏడాది సంయుక్త నుంచి కనీసం మూడు ప్రాజెక్టులు రిలీజవడం ఖాయం.