Sampath Nandi: ఆయన గురించి అందరికంటే కాస్త ఎక్కువ తెలుసు
ఏమైంది ఈవేళ(Emaindhi Ee Vela) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన సంపత్ నంది(Sampath Nandi) రెండో సినిమానే రామ్ చరణ్(Ram Charan) తో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రచ్చ(Racha) సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలుసు. రచ్చ సినిమా హిట్ అవడంతో సంపత్ నందికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో సినిమా చేసే అవకాశం వచ్చింది. దాని కోసం సంపత్ చాలా కాలం పాటూ వర్క్ కూడా చేశాడు. కానీ తర్వాత ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కకుండా ఆగిపోయింది.
అయితే రీసెంట్ గా సంపత్ నంది కథ అందిస్తూ నిర్మించిన ఓదెల2(Odela2) ప్రమోషన్స్ లో భాగంగా పవన్ తో చేయాల్సిన సినిమా గురించి ఆయన మాట్లాడాడు. పవన్ తో సినిమా చేద్దామనుకుని ఆయనకు బెంగాల్ టైగర్(Bengal Tiger) కథ చెప్పానని, ఆయనక్కూడా కథ నచ్చిందని చెప్పారు. అయితే రవితేజ(Ravi Teja)తో చేసిన కథ, పవన్ కు చెప్పిన కథ ఒకటి కాదని కూడా ఈ సందర్భంగా సంపత్ తెలిపాడు.
పవన్ కు బెంగాల్ టైగర్(Bengal Tiger)కథ నచ్చినప్పటికీ వేరే కథ చేద్దామని ఒక కథ చెప్పి దానిపై వర్క్ చేయమన్నారని, అలా దాని కోసం ఏడాదిన్నర వర్క్ చేశానని, కానీ చివరికి ఇద్దరి ఆలోచనలు వేర్వేరుగా ఉండటంతో ఆ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చానని, ఆ సంవత్సరంన్నర పని చేసినందుకు పవన్ డబ్బులు కూడా ఇప్పించారని, తర్వాత కూడా సినిమా చేద్దామని ఓ నిర్మాతతో కబురు పంపారని సంపత్ వెల్లడించాడు. పవన్ ఎంత మంచి మనిషో అందరికీ తెలుసని, తనకు అందరికంటే ఇంకొంచెం ఎక్కువ తెలుసని చెప్తున్న సంపత్ నంది, వీలైతే పవన్ తో తప్పకుండా సినిమా చేస్తానని, ఆయనతో తనకు ఇప్పటికీ మంచి బాండింగ్ ఉందని సంపత్ వెల్లడించాడు.













