Samantha: సమంత తెలివైన ప్లాన్
హీరోయిన్లకు ఫామ్ లో ఉన్నప్పుడున్నంత క్రేజ్ ఆ తర్వాత ఉండదు. అప్పటివరకు వెంటపడిన దర్శకనిర్మాతలు, మీడియా కూడా వారిని లైట్ తీసుకుంటుంది. క్రమంగా అవకాశాలు కరువైపోతాయి. ప్రస్తుతం సమంత(Samantha) పరిస్థితి కూడా అదే. పెళ్లి, విడాకులు, ఆ తర్వత మయోసైటిస్ వల్ల అనుకోకుండా సమంతకు గ్యాప్ వచ్చింది.
అనారోగ్యంతో బ్రేక్ తీసుకున్న సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. కానీ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో చేసేది లేక ఇండస్ట్రీలో ఎలాగైనా మళ్లీ నిలదొక్కుకోవాలని ఎంతో తెలివైన అడుగేసింది సమంత. అందులో భాగంగానే నిర్మాతగా మారి సినిమాలు చేస్తోంది. తన సొంత బ్యానర్ లో నిర్మించిన శుభం(Subham) సినిమా మే 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సమంత కూడా కీలక పాత్ర చేస్తోంది.
శుభం సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి సినిమాలు లేని లోటు తీరడంతో పాటూ సమంతకు ఈ సినిమాలో చేసినటువంటి పాత్రలు మరిన్ని దక్కే అవకాశముంది. శుభంపై సమంత తో పాటూ చిత్ర యూనిట్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. మరి ఈ సినిమా సమంతకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.






