నాగ చైతన్యను ఓవర్ టేక్ చేసిన సమంత అక్కినేని
ఓవర్ టేక్ అంటే డ్రైవింగ్ లో కాదు ఆమె పారితోషకంలో నాగ చైతన్యను మించిపోయింది. సాధారణంగా కొంత మంది హీరోయిన్స్ పెళ్లి తరువాత చాలా వరకు సినిమాలు తగ్గుతాయి లేదా తగ్గించేస్తారు. అక్కినేని వారి కోడలు సమంత కెరీర్ లో మాత్రం అలాంటివేమి జరగలేదు ఇంకా ఆ ఇమేజ్ కొనసాగుతూనే వుందని చెప్పాలి. ఆమె పెళ్లి తరువాత కూడా స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ఇమేజ్ ని ఇంకా కొనసాగడం కాదు ఓ విధంగా ఆమె రేంజ్ ఇంకా పెరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె ఒక బాలీవుడ్ పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. పాన్ ఇండియా అనేది ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో వినిపిస్తున్నదే. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మంది పాన్ ఇండియా కథల కోసం అన్వేషిస్తున్నారు. ఇక హీరోయిన్స్ కూడా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో వారి టాలెంట్ చూపిస్తున్నారు. అనుష్క తరువాత సమంత కూడా బాలీవుడ్ లో కూడా క్రేజ్ అందుకోవాలని ట్రై చేస్తోంది. మజిలీ వంటి డిఫరెంట్ సినిమాతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకున్న తరువాత ఓ బేబి, జాను సినిమాతో అమ్మడు కాస్త డీలా పడింది. ఇక నెక్స్ట్ మంచి కాన్సెప్ట్ లతో క్లిక్కవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలి మ్యాన్’ సెకండ్ సీజన్ లో నటించే ఛాన్స్ బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది.
అయితే ఇదే సమయంలో అమ్మడికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ దక్కింది. సోని పిక్చర్స్ లో తెరకెక్కుతున్న లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాలో కూడా సమంతను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు. ఇక సినిమా కోసం సమంత భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓ విధంగా తన భర్త నాగ చైతన్య కంటే కూడా ఆ ఎమౌంట్ ఎక్కువే అని తెలుస్తోంది. చైతన్య ఒక్కో సినిమాకు 8 నుంచి 10కోట్లు అందుకుంటున్నాడు. ఇక సమంతకు పాన్ ఇండియా సినిమా కాబట్టి 10కోట్ల కంటే ఎక్కువే ఇవ్వనున్నారని సమాచారం.













