Samantha: మార్పు కోసం ప్రయత్నిస్తున్న సమంత
చిత్ర పరిశ్రమలో హీరోహీరోయిన్లు సమానంగా కష్టపడుతున్నప్పటికీ వారిద్దరికీ రెమ్యూనరేషన్లు ఒకేలా ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే. హీరోల రెమ్యూనరేషన్ భారీగా ఉంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్ హీరోలతో పోలిస్తే ఓ మోస్తరు గా మాత్రమే ఉంటుంది. ఈ వ్యత్యాసంపై ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడినప్పటికీ ఫలితం మాత్రం లేకపోయింది.
ఈ విషయంపై గతంలో ఎన్నో సార్లు మాట్లాడిన సమంత(Samantha), ఇప్పుడు మరోసారి రెస్పాండ్ అయింది. హీరోహీరోయిన్లు ఇద్దరూ సమానంగా కష్టపడినప్పటికీ హీరోయిన్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తారో తనకు అర్థం కావడం లేదని, ఇండస్ట్రీలో తనను ఇబ్బంది పెట్టే అంశాల్లో ఇది కూడా ఒకటని చెప్పిన సమంత, ఈ విషయంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.
తన బ్యానర్ లో నిర్మించే సినిమాల్లో నటించే వారికి లింగ బేధం లేకుండా అందరికీ సమానంగా రెమ్యూనరేషన్లు ఇస్తుందట సమంత. మార్పు తనతోనే మొదలవాలని అందుకే సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సమంత సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమాలో పని చేస్తున్న అందరికీ తాను సమాన జీతాలు ఇస్తున్నట్టు డైరెక్టర్ నందినీ రెడ్డి(Nandini Reddy) వెల్లడించింది.













