గ్లో పోస్టుపై సమంత కౌంటర్
గత కొన్ని నెలల నుంచి సమంత గురించి ఎవరు మాట్లాడుకున్నా వస్తున్న మొదటి మాట పాపం సమంత అని. దాదాపు పదిహేనుళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న సమంత, తెలుగమ్మాయిగా మారి చాలా కాలమే అయింది. సినీ కెరీర్లో పీక్స్‌ను అందుకున్నాక నాగచైతన్యను పెళ్లి చేసుకుని మూడేళ్లు సంతోషంగా ఉన్నారు. ఏడాదిన్నర కిందటే అతడి నుంచి విడిపోయి ఎవరి జీవితం వారు కొనసాగిస్తున్నారు.
ఆ తర్వాత తన కెరీర్‌ను తిరిగి పీక్స్‌ను చేరుకునేలా కనిపించిన సామ్.. కొన్ని నెలల కిందట మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేసింది. అప్పట్నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత రీసెంట్గా కోలుకున్నట్లుగా వార్తలొచ్చాయి. తన కొత్త మూవీ శాంకుతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కూడా సమంత హాజరైంది.
కానీ అందరూ అనుకున్నట్లు సమంత ఈవెంట్లో ఎప్పటిలా సౌకర్యంగా కనిపించలేదు. ఆమెలో అన్ ఈజీనెస్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఈవెంట్లో ఉన్నంతసేపు ఇబ్బందిగానే కనిపించింది. దీంతో తన గ్లో పోయిందంటూ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్టుపై సమంత స్వయంగా స్పందించింది. తనలా నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకోకుండా, తాను అందిస్తున్న ప్రేమతో గ్లో పొందాలని తాను కోరుకుంటున్నట్లు ఆ పోస్టుకు కౌంటర్ వేసింది సమంత.
ఈ కౌంటర్‌కు మద్దతుగా చాలా మంది నెటిజన్లు సమంత తరఫున ట్వీట్లు వేశారు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడ్డ కొంత కాలానికే ఇలా హెల్త్ ఇష్యూస్ రావడంపై సమంత ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె పూర్తిగా కోలుకుని ఇంతకు ముందులా సరదాగా కనిపించాలని ఫ్యాన్స్ తో పాటు అందరూ కోరుకుంటున్నారు.













