Samantha: ఆడియన్స్ కు తనపై ప్రేమ తగ్గలేదంటున్న సమంత
ఏ మాయ చేసావే(Ye Maya chesave) మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత, తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడటం, దాని ట్రీట్మెంట్ కోసం కొన్ని రోజుల పాటూ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత(Samantha) ఇప్పుడు మళ్లీ కెరీర్ ను స్పీడప్ చేస్తోంది.
అయితే సమంత నుంచి సినిమా వచ్చి ఇప్పటికి రెండేళ్ళు దాటుతోంది. ఎవరైనా రెగ్యులర్ గా ప్రేక్షకులకు కనిపిస్తూ వారిని అలరిస్తుంటేనే వారి ఫేమ్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే వారి ఫేమ్, క్రేజ్ తగ్గడం ఖాయం. కానీ సమంతకు మాత్రం ఆ సమస్య లేదు. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే తెలిపింది.
తాను సినిమా చేసి రెండేళ్లవుతున్నా తనపై ప్రేక్షకులకు ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ సమంత భావోద్వేగానికి గురైంది. ఇదిలా ఉంటే సమంత ఓ వైపు నటిగా ఉంటూనే మరోవైపు నిర్మాతగా కూడా దూసుకెళ్లాలని ట్రై చేస్తోంది. ఆల్రెడీ సమంత నిర్మాతగా శుభం(Subham) అనే సినిమాను నిర్మించింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













