Salman Khan: ఆ విషయంలో భయంగా ఉంది

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) హిట్ అందుకుని చాలా రోజులవుతుంది. ఎన్నో సినిమాలుగా ఎంతో ట్రై చేస్తున్నప్పటికీ సల్మాన్ కు మాత్రం హిట్ అందడం లేదు. దీంతో ఎలాగైనా తన తర్వాతి సినిమాతో హిట్ అందుకోవాలని చాలా కసిగా ఉన్నారు సల్మాన్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్(Battle of Galvan) అనే సినిమా చేస్తున్నారు.
2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా ఆ సంఘటనల్లో 20 మంది ఇండియన్ జవాన్లు చనిపోయారు. ఈ వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని అపూర్వ లఖియా(Apporva Lakhiya) బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ ను తెరకెక్కించనుండగా అందులో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్ గా నటించనున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్మాన్ ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ షూటింగ్ మరో 10 రోజుల్లో మొదలవనుందని, ఎన్నో కష్టమైన లొకేషన్లలో ఆ సినిమా తెరకెక్కనుందని, లడాఖ్ లోని కొన్ని ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నామని, గడ్డ కట్టే చలిలో 8 రోజుల పాటూ షూటింగ్ చేయబోతున్నామని, ఆ విషయంలో తలచుకుంటేనే భయంగా ఉందని, అయినప్పటికీ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి తాను రెడీగా ఉన్నానని సల్మాన్ తెలిపారు.