ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ టీమ్ ట్రీట్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ సలార్. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. అయితే సలార్ లో ప్రభాస్ లుక్ ను కూడా మేకర్స్ ఇప్పటివరకు పూర్తిగా రివీల్ చేయలేదు. టీజర్ లో ఫేస్ మొత్తం చూపించలేదు. మొదట్లో ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేద్దామనుకుని తర్వాత వాయిదా వేయడంతో కొంత ప్రతికూలత వచ్చింది.
కానీ రీసెంట్గా మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయగానే సలార్ కు పూర్వ వైభవం వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వినిపిస్తుంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సలార్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనిపించేలా, యాక్షన్ సీక్వెన్స్, ప్రభాస్ ఎలివేషన్ సీన్లతో నింపనున్నారట.
ఆ తర్వాత రిలీజ్ కు కొంచెం ముందుగా మరో ట్రైలర్ ను రెడీ చేసి, రిలీజ్ ట్రైలర్ లో కథను ఫోకస్ చేసి ఫ్యాన్స్ ను ట్రీట్ ఇవ్వనుందట సలార్ టీమ్. ఈ సారి రెండు నెలల ముందుగానే సలార్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టనుందట చిత్ర యూనిట్. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ కు ముందు రోజే విదేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రీమియర్స్ పడనున్నాయి.













