శ్రీలీల స్థానంలో అఖిల్ హీరోయిన్
ఏదైనా సినిమాలకు ఓ కాంబినేషన్ అనుకున్నాక షూటింగ్ లేట్ అయితే మాత్రం తర్వాత అందులో చాలా ఛేంజెస్ వస్తాయి. మొదట్లో గుంటూరు కారం సినిమాకు పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నారు కానీ షూటింగ్ లేట్ వల్ల ఆమె కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. తర్వాత టిల్లూ స్వ్కేర్ మూవీ లో కూడా హీరోయిన్ మారిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా చేరినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రానున్న ప్యాన్ ఇండియా సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తామని నాగవంశీ ఇప్పటికే హింట్ ఇచ్చాడు.
విజయ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా మ్యాడ్ ప్రమోషన్స్ లో నాగవంశీ చాలా గట్టిగా నొక్కి మరీ చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి సాక్షి వైద్య వచ్చిందని తెలుస్తోంది. ఫ్యామిలీ స్టార్ కోసం గౌతమ్ ప్రాజెక్ట్‌ను కాస్త లేటుగా మొదలుపెట్టనుండటంతో శ్రీలీల ఆ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందని తెలుస్తోంది. దీంతో ఆ ఛాన్స్ సాక్షికి దక్కిందని సమాచారం. ఇదే నిజమైతే సాక్షికి బంపరాఫర్ దక్కినట్లే.













