శైలేష్ పై సైంధవ్ ఎఫెక్ట్
ఒక్క సినిమా రిజల్ట్ తో ఒక్కోసారి తమ కెరీర్ మొత్తం మారిపోతుంటుంది. సినిమా హిట్ అయితే కెరీర్ సూపర్ అనేలా దూసుకెళ్తుంది. అదే ఫ్లాపయితే చేతిలో ఉన్న సినిమాలు కూడా జారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను పరిస్థితి అలానే ఉంది. అతని దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్-2 మంచి సక్సెస్ అవడంతో శైలేష్ మీద అందరికీ మంచి నమ్మకం ఏర్పడింది.
అందుకే విక్టరీ వెంకటేష్ తన కెరీర్ మైల్ స్టోన్ ఫిల్మ్ అయిన 75వ సినిమా బాధ్యతలను శైలేష్ కు అప్పగించాడు. సైంధవ్ సినిమా మొదలైనప్పుడు కచ్ఛితంగా సినిమా హిట్ అనుకున్నారు. టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ బాగా అనిపించడంతో ఆడియన్స్ కు సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ చివరకి సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది.
సైంధవ్ సినిమా ఫ్లాప్ అవడంతో దానికి సీక్వెల్ ను చేసే ఛాన్స్ లేకుండా పోయింది. ఇదిలా ఉంటే సైంధవ్ తర్వాత శైలేష్, నానితో హిట్3 సినిమాను చేయాల్సి ఉంది. కానీ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాని సంతృప్తికరంగా లేకపోవడంతో మార్పులు చేర్పులు చేయమని శైలేష్ కు చెప్పాడట. ప్రస్తుతం శైలేష్ ఆ పనిలోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సైంధవ్ ఫ్లాప్ అవడంతో శైలేష్ టాలెంట్ పై నాని కి డౌట్ వచ్చింది. అదే సైంధవ్ హిట్ అయుంటే నాని ఏం ఆలోచించకుండా హిట్3ని సెట్స్ పైకి తీసుకెళ్లేవాడు.













