Saif Ali Khan: సైఫ్ ఆస్తుల్లో ఎక్కువ విలువైనది ఏంటంటే
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్(Saif ali khan) కు ఈరోజుతో 55 ఏళ్లు పూర్తయ్యాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సైఫ్ కు చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్(Mansoor ali khan) ఇండియాకు చెందిన స్టార్ క్రికెటర్ కాగా, తల్లి షర్మిలా ఠాగూర్(Sharmila thakur) బాలీవుడ్ స్టార్ నటి. 2011లో తండ్రి చనిపోయాక సైఫ్ కు 10వ పటౌడీ బిరుదు వారసత్వంగా వచ్చింది.
ఓ వైపు వారసత్వాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఇండస్ట్రీలో వచ్చిన సక్సెస్ ను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.10-12 కోట్లు తీసుకుంటారు. ఎండార్స్మెంట్స్ కు అయితే రూ.1- 5 కోట్లు తీసుకుంటారు. వీటన్నింటి ఆధారంగా తాజా రిపోర్ట్స్ సైఫ్ ఆస్తిని రూ.1200 కోట్లుగా తేల్చింది. దీంతో పాటూ అతని భార్య కరీనా కపూర్(Kareena Kapoor) మరో రూ.485 కోట్ల ఆస్తిని కలిగి ఉంది.
వాటితో పాటూ సైఫ్ కు ఓ రెండు నిర్మాణసంస్థలతో సహ యజమాని గా కూడా ఉన్నారు. కాగా సైఫ్ కు ఉన్న ఆస్తి మొత్తంలో అత్యంత విలువైంది హర్యానా లో ఉన్న పటౌడీ ప్యాలెస్. కేవలం ఆ ఒక్క ప్యాలెస్ విలువే రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఏదేమైనా 55 ఏళ్ల వయసులో కూడా సైఫ్ బాలీవుడ్ లోని ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్న తారల్లో ఒకరిగా నిలవడం విశేషం.







