Saif Ali Khan: నా కొడుక్కి సారీ చెప్పింది అందుకు కాదు
ప్రభాస్(Prabhas), కృతి సనన్(Krithi Sanon) జంటగా ఓం రౌత్(OM Raut) దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్(Adipurush) సినిమాలో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) విలన్ గా నటించాడు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇండియన్ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని ఫ్లాపుల్లో ఆదిపురుష్ కూడా ఒకటి. ఈ సినిమా గురించి మొన్నామధ్య సైఫ్ అలీఖాన్ చేసిన కామెంట్స్ నెట్టింట పెద్ద వివాదమైన సంగతి తెలిసిందే.
సైఫ్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆదిపురుష్ సినిమా చూడమని తన కొడుకు తైమూర్ అలీఖాన్(Taimur Ali Khan) కు చెప్పినందుకు సారీ చెప్పానని అన్నాడు. దీంతో ఒక్కసారిగా సైఫ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటూ ఆ కామెంట్స్ చేసినందుకు గానూ సైఫ్ అలీ ఖాన్ ను నెటిజన్లంతా విమర్శిస్తున్నారు.
తన కామెంట్స్ వల్ల విమర్శలు వస్తున్న కారణంగా సైఫ్ తన మాటను మారుస్తూ, రీసెంట్ గా తన ఓటీటీ రిలీజ్ జ్యువెల్ థీఫ్(Jewel Thief) ప్రమోషన్స్ లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాను తన కొడుక్కి సారీ చెప్పింది సినిమా చూడమన్నందుకు కాదని, తాను రావణాసురుడి లాంటి చెడ్డ క్యారెక్టర్ చేసినందుకని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో సైఫ్ మాట మార్చాడని అందరికీ తెలియడంతో ఈసారి మాట మార్చినందుకు సైఫ్ ను విమర్శిస్తున్నారు.






