ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్న సాయి పల్లవి
మలయాళ ప్రేమమ్ సినిమాలో మలార్ గా సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే మంచి హిట్ అవడంతో సాయి పల్లవికి క్రేజ్ బాగా పెరిగింది. ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ పల్లవి ఏ సినిమా పడితే అది ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
అయితే సాయి పల్లవి నుంచి సినిమా వచ్చి ఇప్పటికి రెండేళ్లవుతుంది. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి తండేల్ లో నటిస్తుంది. ఈ రెండేళ్లూ ఒక్క సినిమా కూడా చేయలేదు. సౌత్ ను వదిలి బాలీవుడ్ బాట పట్టడం వల్లే సాయి పల్లవి ఇక్కడ సినిమాలు చేయలేకపోతుందని కొందరంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ రామాయణంతో పాటూ మరో సినిమాలో నటిస్తున్న పల్లవి తమిళంలో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తుంది.
తెలుగులో తండేల్ కాకుండా మరో సినిమాకు ఇప్పటి వరకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. అయితే తెలుగు నుంచి సాయి పల్లవికి సరైన కథలు వెళ్లకపోవడం వల్లే ఆమె ఏ సినిమానూ ఒప్పుకోలేదని ఆమె సన్నిహితులంటున్నారు. ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయకూడదని రూల్ పెట్టుకున్న సాయి పల్లవి తనకు పాత్ర ఎంతో నచ్చితే తప్ప ఆ సినిమాను ఓకే చేయదు. తండేల్ తర్వాత అయినా అమ్మడి దగ్గరకు మంచి కథలతో ఎవరైనా దర్శకులు వెళతారేమో చూద్దాం.













