హీరోయన్ లలో సాయి పల్లవి చాలా స్పెషల్
సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి చేసిన సినిమాలు ఫెయిలయినప్పటికీ నటిగా మాత్రం ఆమె ఎప్పుడూ ఫెయిల్ అయింది లేదు. ఆమె చేసిన ప్రతి సినిమాతోనూ నటిగా మంచి మార్కులే వేసుకుంది. అవతల ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సాయి పల్లవి ఆ సినిమా ఒప్పుకుంటుంది. లేదంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది.
ప్రస్తుతమున్న జెనరేషన్ లో నటన, డ్యాన్స్ పరంగా చూసుకుంటే బెస్ట్ యాక్ట్రెస్ లిస్ట్ లో సాయి పల్లవి టాప్ లో ఉంటుంది. అమ్మడు ఏ భాషలో సినిమా చేసినా సరే డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. అలాగని భారీగా ఏమీ ఛార్జ్ చేయదు. నిర్మాతలకు అందుబాటులోనే పారితోషికం తీసుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటుంది.
అలాంటి సాయి పల్లవి గతంలో హను రాఘవపూడి దర్శకత్వంలో పడిపడి లేచే మనసు సినిమా చేసింది. ఆ సినిమాను డైరెక్టర్ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడం వల్ల ఆడియన్స్ కు కనెక్ట్ అవక డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలైన సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లికి నష్టాల్ని మిగిల్చింది. అయితే సినిమాకు నష్టాలు రావడంతో సాయి పల్లవి తన పూర్తి రెమ్యూనరేషన్ తీసుకోకుండా కొంత మాత్రమే మిగిలింది వదిలేసిందట. ఎవరైనా సరే హీరోయిన్లు ముందుగానే తమ రెమ్యూనరేషన్ తీసుకుని సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తప్పుకుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం అందరికీ భిన్నంగా ఉంది. అందుకే ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్.













