ఐకాన్ స్టార్‌ను అన్‌ఫాలో చేసిన సుప్రీమ్ హీరో
జనసేనాని ఏపీలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం విజయవాడకు వెళ్లి ఆ వేడుకలో పాల్గొన్నారు. కానీ ఆ వేడుకలో అల్లు ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ కనిపించలేదు. అల్లు అరవింద్ కానీ, అల్లు అర్జున్ కానీ అక్కడ కనిపించలేదు. కొన్నేళ్ల నుంచి మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ వేరుపడినట్లు కనిపిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో బన్నీ విషయంలో మెగా ఫ్యాన్స్ లో ఓ వర్గం బాగా కోపంలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఏపీలో ఎలక్షన్స్ టైమ్ లో పవన్ కు మద్దతుగా కేవలం ఓ ట్వీట్ వేసిన బన్నీ, వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా రవి కోసం నంద్యాలకు వెళ్లి మరీ కలవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అప్పట్నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్.. బన్నీని అన్ని సోషల్ మీడియాల్లో అన్‌ఫాలో చేశాడనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ తో పాటూ ఇన్‌స్టా లో కూడా బన్నీని తేజూ అన్‌ఫాలో చేశాడట. బన్నీని మాత్రమే కాదు, బన్నీ భార్య స్నేహ ను కూడా తేజూ అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది.













