గ్యాప్ ను తేజ్ భలే వాడుకున్నాడే!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒకప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండేవాడు. కానీ మూడేళ్ల కిందట జరిగిన యాక్సిడెంట్ వల్ల తన లుక్స్ మొత్తం మారిపోయాయి. విరూపాక్ష సినిమాతో రీఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నప్పటికీ తేజ్ మూమెంట్స్ లో యాక్టివ్నెస్ మాత్రం లేదు. డైలాగ్ డెలివరీ కూడా మారింది. బిగ్ స్క్రీన్ పై తేజ్ చాలా తేడాగా కనిపించాడు.
మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమాలో కూడా తేజ్ యాక్టివ్ గా లేడు. అయితే ఆ టైమ్ లో తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకోలేదని, తనకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, వాటిని అధిగమించి ఫిట్ గా అవడానికి కాస్త టైమ్ పడుతుందని, అందుకే గ్యాప్ తీసుకుంటున్నట్లు చెప్పాడు.
అయితే తేజ్ చెప్పింది మూడు నాలుగు నెలలే గ్యాప్. కానీ బ్రో రిలీజై ఏడాది కావస్తున్నా తన కొత్త సినిమాను స్టార్ట్ చేసింది లేదు. సంపత్ నందితో చేయాల్సిన సినిమా కూడా ఆగిపోవడంతో లాంగ్ గ్యాప్ వచ్చింది. ఈ లాంగ్ గ్యాప్ ను తేజ్ బాగానే ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తేజ్ హెల్త్ పరంగా అన్ని ప్రాబ్లమ్స్ ను అధిగమించాడని, తన కొత్త సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. సిక్స్ ప్యాక్ చేసే స్థాయికి వచ్చాడంటే తేజ్ నిజంగానే పూర్తిగా కోలుకున్నట్లు అనుకోవచ్చు. సాయి ధరమ్ తేజ్ తన తర్వాతి సినిమాను రోహిత్ అనే కొత్త దర్శకుడితో చేయనున్నట్లు రీసెంట్ గానే అనౌన్స్ చేశాడు.













