వృద్దాశ్రమాన్ని ప్రారంభించిన సాయిధరమ్ తేజ్
టాలీవుడ్ సెలబ్రిటీలలో సామాజిక సేవలో ఎప్పడూ ముందుండేవారున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి నటుల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఇటీవలే విజయవాడలోని వృద్దాశ్రమం (ఓల్డ్ ఏజ్ హోం)లోని వారికి నేనున్నానంటూ తనవంతు సాయమందించి గొప్ప మనసు చాటుకున్నాడు. తల్లిదండ్రులతో సమానమైన వృద్ధులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా వారి బాగోగులు కూడా చూసుకుంటానని హామీనిచ్చారు. వారికి అండగా నిలుస్తానని ఇచ్చిన మాట ప్రకారం విజయవాడలో వృద్దాశ్రమాన్ని ప్రారంభించాడు సాయిధరమ్.
ఈ సందర్భంగా గొప్ప మనసుతో తమకు అండగా నిలుస్తున్న సాయిధరమ్ కు వృద్దులంతా ఘనస్వాగతం పలికారు. పేదప్రజలకు సాయం చేస్తున్న సాయిధరమ్ తేజకు దీవెనలు అందించారు. డిఫరెంట్ స్టోరీలతో కూడిన సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్ ఉదారస్వభానికి అందరూ సెల్యూట్ కొడుతున్నారు.













