సాయి తేజ్ బ్రేక్ కు కారణమిదే
విరూపాక్ష సినిమాతో మంచి జోష్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఆ వెంటనే తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించాడు. ఈ మూవీకి అనుకున్నంత టాక్ రాకపోయినా డీసెంట్ టాక్ తో బయటపడింది. తేజ్ ఫామ్ లోకి వచ్చాడనుకుంటున్న టైమ్ లో సినిమాలకు కొంత బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పి అందరినీ షాక్ కు గురయ్యేలా చేశాడు.
తేజ్ అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్ కు గురైన తేజ్‌కు అప్పటి గాయాలు ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నాయట. దీంతో కొంత రెస్ట్ తీసుకుని మళ్లీ వస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే హెల్త్ కేర్ తీసుకోవాలని తేజ్ జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆరు నెలల గ్యాప్ తీసుకోవాలని తేజ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బ్రేక్ తర్వాతే ఆయన మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని మెగా కాంపౌండ్ నుంచి సమాచారం అందుతుంది. మరి సాయి తేజ్ బ్రేక్ తర్వాత ఎలాంటి సినిమాలతో అలరిస్తారో చూడాలి.













