ఆర్ ఎక్స్ 100 హీరోయిన్గా సుతారియా!
గత ఏడాది తెలుగులో విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది ఆర్ఎక్స్ 100. బోల్డ్ లవ్ స్టోరీ నేపథ్యంలో అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్‌లో కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. సాజిద్ నడియాద్ వాలా నిర్మించనున్న ఈ చిత్రాన్ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ఫేమ్ తారా సుతారియా హీరోయిన్గా నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.













