నీల్ పై ఒత్తిడి.. అంతా ఉత్తుత్తే!
కెజిఎఫ్(KGF), సలార్(Salaar) సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న ప్రశాంత్ నీల్(Prasanth Neel) త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్(Prabhas) బర్త్ డే సందర్భంగా సలార్2(Salaar2) మొదలవనుందని కొన్ని పేరున్న ట్విట్టర్ హ్యాండిల్స్ లో రావడం ఫ్యాన్స్ ను అయోమయానికి గురి చేసింది.
నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్(Hombale Films) ఇప్పటివరకు దీని గురించి అధికారికంగా అనౌన్స్ చేయకుండా వేరే వాళ్లు సలార్2 గురించి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు శాండిల్ వుడ్ టాక్ చూస్తుంటే సలార్2ను త్వరగా పూర్తి చేసి తర్వాతే తారక్(Tarak) ప్రాజెక్టుకు వెళ్లమని నిర్మాణ సంస్థ నీల్ పై ఒత్తిడి తెస్తుందంటున్నారు. కానీ అందులో నిజం లేదని ప్రభాస్ సన్నిహిత వర్గాలంటున్నాయి.
నీల్ ఇప్పటికిప్పుడు సలార్2 తీయాలంటే ప్రభాస్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పడు కానీ ప్రస్తుతమున్న కమిట్మెంట్స్ దృష్ట్యా సలార్2 రావాలంటే మరో సంవత్సరం ఆగితే తప్ప జరగదని తెలుసుకుని అందరూ కలిసే ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తర్వాత ఎన్టీఆర్ ఎలాగూ ఫ్రీ అవుతాడు కాబట్టి నీల్ ముందుగా తనతో సినిమా చేసి ఆ తర్వాత సలార్2 పూర్తి చేస్తాడని టాక్. కాబట్టి ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి అనే మాటలో ఏ మాత్రం నిజం లేదు.













