కల్కికి సీక్వెల్ ఉన్నట్టా? లేనట్టా?
ఈ మధ్య భారీ సినిమాలుగా వస్తోన్న చిత్రాలన్నీ రెండు భాగాలుగా రావడం కామనైపోయింది. ముందు ఒక సినిమాగా మొదలుపెట్టి తర్వాత సెకండ్ పార్ట్ కూడా ఉందని అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2898ఏడీ కూడా గ్యారెంటీగా రెండు పార్టులుగానే రానుందని అన్నారు. కొన్నాళ్ల పాటూ దీనిపై మీడియాలో, నెట్టింట కూడా ప్రచారం జరిగింది.
కానీ టీమ్ నుంచి మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న కల్కి సినిమా ప్రస్తుతానికైతే ఒక పార్ట్ అనే అందరూ అనుకుంటున్నారు కానీ మెజారిటీ ఆడియన్స్ మాత్రం కల్కికి సెకండ్ పార్ట్ ఉంటుందంటున్నారు. సినిమా చివర్లో సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేసి ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇస్తారనే ఆలోచనతో ఉన్నారు.
కల్కి లాంటి పెద్ద కథలను కేవలం మూడు గంటల్లో చెప్పడం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ మూడు ప్రపంచాలను చూపించడంతో పాటూ పురాణాలను కూడా టచ్ చేయబోతున్నాడు. ట్రైలర్ లో అతను కథ వివరించిన తీరు చూస్తే ఒక్క పార్ట్ లో ఆయన అనుకున్న విషయాలను చెప్పడం సాధ్యమేనా అనిపిస్తుంది. అందుకే కల్కికి కచ్ఛితంగా రెండో పార్ట్ ఉంటుందని, ఫస్ట్ పార్ట్ లో ఒక అధ్యాయంలా కథను చూపించి, సెకండ్ పార్ట్ లో మరో అధ్యాయాన్ని చూపించనున్నారని అంటున్నారు. మరికొన్ని గంటల్లో ఈ విషయంలో క్లారిటీ రానుంది.













