మరోసారి కీర్తి పెళ్లిపై వార్తలు
గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు వేగంగా అడుగులేస్తున్న కీర్తి సురేష్(Keerthy Suresh) సౌత్ లోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. తన పెళ్లి గురించి తరచూ నెట్టింట ప్రచారం జరుగుతూ ఉంటుంది. కమెడియన్ తో లవ్ అని ఒకసారి, మ్యూజిక్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని ఓ సారి, బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ కానుందని ఎన్నో రూమర్లు వచ్చాయి.
కానీ అవేవీ నిజం కాదని అప్పట్లోనే తేలింది. కానీ ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లి గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ లో కీర్తి పెళ్లి కూతురు కానుందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కీర్తి పేరెంట్స్ కుదిర్చిన పెళ్లే చేసుకోబోతుందని, తన బంధువునే కీర్తి పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది.
కీర్తి తల్లి మేనక(Menaka) ఒకప్పటిక నటి కాగా తండ్రి సురేష్(Suresh) ప్రొడ్యూసర్. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ కీర్తి హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టుకుంది. మొదట్లో కీర్తికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు కానీ మహానటి(maha Nati) తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కీర్తి పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరి కీర్తి పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













