Rukmini Vasanth: టాక్సిక్ లో రుక్మిణి కీలక పాత్ర

సప్త సాగరాలు దాటి(Sapta sagaralu daati) ఫ్రాంచైజ్ సినిమాలతో అపార క్రేజ్ ను సొంతం చేసుకున్న కన్నడ భామ రుక్మిణి వసంత్(rukmini vasanth) ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ భారీ డిమాండ్ ను ఏర్పరచుకున్న రుక్మిణి వసంత్, విజయ్ సేతుపతి(Vijay sethupathi) హీరోగా నటించిన ఏస్(Ace) సినిమాలో కనిపించి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
రీసెంట్ గా రిషబ్ శెట్టి(Rishab Shetty) ప్రధాన పాత్రలో వస్తోన్న కాంతార చాప్టర్1(kanthara chapter1) షూటింగ్ లో జాయిన అయిన రుక్మిణి వసంత్, శివ కార్తికేయన్(siva karthikeyan) తో కలిసి ఓ సినిమా చేస్తుంది. దాంతో పాటూ ప్రశాంత్ నీల్(prasanth neel)- ఎన్టీఆర్(NTR) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon) సినిమాలో కూడా హీరోయిన్ గా నటించనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రుక్మిణి ఖాతాలో మరో సినిమా చేరింది.
అదే టాక్సిక్. యష్(Yash) హీరోగా గీతూ మోహన్ దాస్(Geethu mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలో రుక్మిణి ఓ కీలక పాత్ర చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే రుక్మిణి ఈ సినిమాకు సంబంధించిన పలు షెడ్యూళ్ల షూటింగ్ ను కూడా పూర్తి చేసిందని, కాకపోతే మేకర్స్ రుక్మిణి సినిమాలో ఉందనే విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటింలేదని అంటున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.