#RT76: రవితేజ, కిషోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ #RT76 లెన్తీ ఫారిన్ షెడ్యూల్

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), కిషోర్ తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #RT76 చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.
టీమ్ ప్రస్తుతం కీలక ఫారిన్ షెడ్యూల్‌కి షిఫ్ట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో లొకేషన్ రికీ పనులు పూర్తి చేశారు. ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమవుతోంది. అనంతరం జెనీవా, ఫ్రాన్స్‌లో కూడా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
మొత్తం 25 రోజుల ఈ షెడ్యూల్‌లో కీలక టాకీ పార్ట్‌లతో పాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో రెండు పాటలు చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాకి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ ఈ సినిమాలో న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్ తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది.
ఎమోషనల్ కథలతో అలరించే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ళ. నేషనల్ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.