RT76: భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటున్న రవితేజ

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతూ బిజీగా ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ(raviteja). ఇప్పటికే భాను భోగవరపు(bhanu bhogavarapu) దర్శకత్వంలో మాస్ జాతర(mass jathara) సినిమాను చేసి, దాన్ని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయిన రవితేజ, ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే తన 76వ సినిమాను నేను శైలజ(nenu sailaja) ఫేమ్ కిషోర్ తిరుమల(kishore tirumala)తో అనౌన్స్ చేశాడు.
రవితేజ76(RT76)వ సినిమాకు అనార్కలీ(anarkali) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు మేకర్స్ ఓ క్రేజీ టైటిల్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. అదే భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha mahasayulaki vignapthi). ఆల్మోస్ట్ ఈ టైటిల్ నే మేకర్స్ ఫిక్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. అనార్కలీ కంటే భర్తమహాశయులకు విజ్ఞప్తి అనే టైటిలే క్రేజీగా ఉందని అందుకే ఆ టైటిల్ కు మేకర్స్ ఓటేశారని టాక్.
ప్రస్తుతం రవితేజ76కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ మూవీలో రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్(ashika ranganath) హీరోయిన్ గా నటిస్తుంది. భీమ్స్ సిసిరోలియో(bheems ciciroleo) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కిషోర్ తిరుమల అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా తెరకెక్కించారని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.