జపాన్‌లో అక్టోబర్ 21న విడుదల అవుతున్న’ఆర్ఆర్ఆర్’
ఇండియన్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకువెళ్లిన వ్యక్తి రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి చిత్రాలు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అంతకుమించి అనేలా ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కించాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా, ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. మార్చి 25న రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ రూ.100 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టింది. సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దాని క్రేజ్ తగ్గలేదు. తాజాగా జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయింది ఆర్ఆర్ఆర్. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మరి ఈ మూవీ అక్కడ ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.
RRR TEAM TWEET:
https://twitter.com/RRRMovie/
https://twitter.com/













