Mowgli 2025: రోషన్ కనకాల మోగ్లీ 2025 డిసెంబర్ 13న రిలీజ్
యంగ్ హీరో రోషన్ కనకాల రెండవ చిత్రం మోగ్లీ 2025 రిలీజ్ కు రెడీ అవుతోంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే టీజర్, పాటలు, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది.ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా, డిసెంబర్ 13కి వాయిదా వేశారు, అయితే ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ప్రీమియర్ టాక్ సినిమాకు మరింత బెనిఫిట్ కానుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. రిలీజ్ డేట్ పోస్టర్లో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ ఛీర్ ఫుల్ గా కనిపించగా, బండి సరోజ్ కుమార్ ఇంటెన్స్ అవాతర్ లో కనిపించారు. లీడ్ పెయిర్ మోడరన్ రాముడు–సీతల్లా చూపుతూ తమ ప్రేమకోసం పోరాటం చేసే జంటగా చిత్రీకరించారు.
సరోజ్, రావణుడిని పోలిన ప్రతినాయకుడి పాత్ర. కథ ఈ మూడు పాత్రల మధ్య డైనమిక్ చుట్టూ తిరుగుతుంది. రోషన్ కనకాల ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. మనసు హత్తుకునే ప్రేమకథతో నిండిన ఇంటెన్స్ డ్రామాగా ఉంటుందని హామీ ఇచ్చే అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ ఉండబోతున్నాయి. హర్ష చెముడు కీలక సహాయక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని రామ మారుతి ఎం, సంగీతం కాల భైరవ. ఎడిటింగ్ కోదాటి పవన్ కళ్యాణ్, ప్రొడక్షన్ డిజైన్ కిరణ్ మామిడి, యాక్షన్ కొరియోగ్రఫీ నటరాజ్ మాదిగొండ. థియేటర్లలో ప్రేమ, యాక్షన్ డ్రామాను చూడటానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్నాయి.






