Mowgli: మోగ్లీ ‘సయ్యారే’ పాట చాలా బాగుంది- ఎంఎం కీరవాణి
-రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, సందీప్ రాజ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మోగ్లీ 2025 ఫస్ట్ సింగిల్ సయ్యారే రిలీజ్
బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ‘మోగ్లీ 2025’ (Mowgli) తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025 అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
మేకర్స్ ఫస్ట్ సింగిల్ సయ్యారేను విడుదల చేసి మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు. కాల భైరవ అందమైన ఆర్కెస్ట్రేషన్ తో అద్భుతమైన ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఆస్కార్ విన్నర్ చంద్ర బోస్ హార్ట్ టచ్చింగ్ లిరిక్స్ అందించారు.
ఈ పాట చెవిటి, మూగ అమ్మాయి, సౌండ్ నిరోధించే డివైజ్ ని ధరించి తన వినికిడి సామర్థ్యాన్ని త్యాగం చేయడానికి నిర్ణయించుకున్న అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఎమోషనల్ అతను ఆమెకు ఒక లేఖ రాస్తాడు, ఆమెను ప్రేమిస్తానని ప్రామిస్ చేస్తాడు.
ఐశ్వర్య దారురితో కలసి కాల భైరవ స్వయంగా ఈ పాటకు సోల్ ఫుల్ వోకల్స్ అందించాడు. రోషన్ కనకాల మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సాక్షి మడోల్కర్‌తో అతని ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎట్రాక్టివ్ గా వుంది.
అద్భతమైన కంపోజిషన్, అర్థవంతమైన సాహిత్యం, సోల్ ఫుల్ వోకల్స్ తో సయ్యారే సాంగ్ సినిమా మ్యూజిక్ జర్నీకి పర్ఫెక్ట్ బిగినింగ్.
ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటించగా, హర్ష చెముడు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్క్రీన్ ప్లేను రామ మారుతి ఎం, రాధాకృష్ణ రెడ్డి రాశారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా, కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్‌గా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మోగ్లీ 2025 డిసెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. కలర్ ఫోటో తర్వాత వచ్చిన అతి పెద్ద నిశ్శబ్దాన్ని శబ్దంగా మార్చబోతున్న సందీప్ కి శుభాకాంక్షలు. విశ్వప్రసాద్ గారు నాకు చిరకాల మిత్రులు. కాలభైరవ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ వేడుకకి సుమ గారితో ఉన్న ఆత్మీయ అనుబంధంతో రోషన్ ని ఆశీర్వదించడానికి వచ్చాను. సయ్యారే పాట చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. రోషన్ తొలి సినిమా బబుల్ గమ్ మేం ప్రజెంట్ చేశాము. ఆ సమయంలోనే రోషన్ తో కలిసి మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాము. ఈ సినిమా చాలా పెద్ద స్పాన్ వుంటుంది. కంట్రోల్ బడ్జెట్లో క్వాలిటీ ఏమాత్రం మిస్ అవకుండా పెద్ద స్పాన్ లో తీసిన సినిమా ఇది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండే లవ్ స్టోరీ ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.
హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ… మీడియా మిత్రులకు నమస్కారం. మా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కీరవాణి గారికి ధన్యవాదాలు. ఆయన మా సాంగ్ ని లంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. విశ్వ ప్రసాద్ గారు ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా చాలా ఘనంగా నిర్మించారు. మాకు సపోర్ట్ చేసిన ఆయనకి కృతజ్ఞతలు. కాలభైరవ ఈ పాటని చాలా ప్రేమతో కసితో చేశాడు. సందీప్ కాలభైరవ కాంబినేషన్ ఐదేళ్ల తర్వాత వస్తుంది. ఆ కసి ఈ పాటలో కనిపిస్తుంది.చంద్రబోస్ గారు తన లిరిక్స్ తో సినిమాకి పాటకి ప్రాణం పోశారు. సందీప్ గారు అద్భుతంగా తీశారు. సాక్షి చాలా నేచురల్ గా పెర్ఫామ్ చేసింది. హర్ష నేను మా ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతుంది. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన బండి సరోజ్ గారికి ధన్యవాదాలు. డిసెంబర్ 12న సినిమా రిలీజ్ అవుతుంది. మీరు అంతా సినిమాని ప్రేమిస్తారని కోరుకుంటున్నాను
డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ గా ఐదేళ్ళ తర్వాత మాట్లాడటం చాలా ఎమోషనల్ గా ఉంది. ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. మంచి ఎమోషన్స్ కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన విశ్వ ప్రసాద్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయనను నాకు చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. రోషన్ సాక్షి అద్భుతంగా నటించారు. హర్ష చాలా అద్భుతంగా నటించారు. కాలభైరవ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా మంచి సినిమా తీశాం. ఈ పాట మీకు నచ్చితే దానికి పది రెట్లు సినిమా నచ్చుతుంది. ఈ సినిమాలో నోలన్ పాత్ర చేసిన బండి సరోజ్ గారికి కృతజ్ఞతలు. డిసెంబర్ 12న సినిమా వస్తుంది. ఇది 100% ఫ్యామిలీ ఫిలిం తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను
కాలభైరవ మాట్లాడుతూ… సందీప్ గారితో కలర్ ఫోటో, విశ్వప్రసాద్ గారితో కార్తికేయ 2 సినిమాలు చేశాను. ఈ ఇద్దరితో నా పాజిటివ్ కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మా టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. పాట వినండి. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యూ.
వైవా హర్ష మాట్లాడుతూ… అందరికి నమస్కారం. విశ్వ ప్రసాద్ గారికి కృతి ప్రసాద్ గారికి డైరెక్టర్ సందీప్ గారికి థాంక్యూ సో మచ్. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి వర్క్ చేసాము. సందీప్ కాలభైరవ కలర్ ఫోటో తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్లో వస్తున్నారు. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. రోషన్ అద్భుతమైన ఎమోషన్స్ చూపించారు. డిసెంబర్ 12న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. మీ అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఫస్ట్ సినిమా. నా లైఫ్ లో మెమొరబుల్ డే. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. సయ్యారే పాట నా మనసుకు చాలా దగ్గర అయింది. మా డైరెక్టర్ గారికి, నిర్మాత విశ్వప్రసాద్ గారికి హీరో రోషన్ గారికి థాంక్యూ సో మచ్. ఇంత అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి థాంక్యూ సో మచ్
నిర్మాత కృతిప్రసాద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సయ్యారే నా ఫేవరెట్ సాంగ్. కాలభైరవ గారు అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. ఇది హార్ట్ ఆఫ్ ది ఫిలిం. రోషన్ సాక్షి అద్భుతంగా నటించారు. ఈ వేడుకకు వచ్చి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ సో మచ్.







