బాలీవుడ్‌కు గీత గోవిందం
విజయ్‌దేవరకొండ కథనాయకుడిగా నటించిన అర్జున్‌రెడ్డి చిత్రం బాలీవుడ్లో కబీర్‌సింగ్ పేరుతో పునర్నిర్మితమై మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమాల రీమేక్ హక్కులపై బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా గీతగోవిందం చిత్రాన్ని హిందీలో దర్శకుడు రోహిత్‌శెట్టి రీమేక్ చేయబోతున్నారు. కుటుంబ బంధాలు, వినోదం సమ్మిళితంగా రూపొందిన ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని రోహిత్‌శెట్టి ఇటీవలే సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ రీమేక్‌కు ఆయన దర్శకత్వం వహిస్తారా? నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తారా అన్నది ఇంకా వెల్లడికాలేదు. ఇందులో షాహిద్‌కపూర్ సోదరుడు ఇషాన్ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా రూపొందుతున్న సూర్య వన్షీ చిత్రానికి రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.













