Dragon: ఎన్టీఆర్ సినిమాలో కన్నడ స్టార్?

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తన స్టార్‌డమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్(NTR) ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నింటినీ భారీగానే చేసుకుంటూ వస్తున్నాడు. దేవర1(Devara1)తో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్(NTR), రీసెంట్ గా వార్2(War2) సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమాతో ఆశించిన ఫలితం రాలేదు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్(prasanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు.
డ్రాగన్(Dragon) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కర్ణాటకలోనే జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు దేశం మొత్తం మీద ఫాలోయింగ్ ఏర్పడగా, కర్ణాటకలో అతనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. తారక్ కు కన్నడ మూలాలు కూడా ఉండటం వల్ల ఆయన కన్నడలో చాలా బాగా మాట్లాడతాడు. ఈ మూవీతో ఎన్టీఆర్ కన్నడ ఆడియన్స్ కు మరింత దగ్గరవాలని తారక్ ప్రయత్నిస్తున్నాడు.
డ్రాగన్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ప్రశాంత్ నీల్ కాంతార(kanthara) హీరో రిషబ్ శెట్టి(rishab shetty)తో చర్చలు జరుపుతున్నారని, ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో రిషబ్ శెట్టి కనిపించనున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ తో తనకున్న ఫ్రెండ్‌షిప్ కారణంగా రిషబ్ కూడా ఆ క్యారెక్టర్ ను చేయడానికి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తారక్ కెరీర్లోనే బెస్ట్ గా నిలపాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.