RGV: ఆర్జీవీ నెక్ట్స్ మూవీపై సాలిడ్ అప్డేట్
విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఎప్పుడూ ఏదొక కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇండియన్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. అలాంటి రామ్ గోపాల్ వర్మ నుంచి గత కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో ఒకప్పుడు ఆయన్ని ఎంతగానో అభిమనించే వాళ్లు కూడా ఇప్పుడాయన్ని విమర్శిస్తున్నారు.
ఆర్జీవీ(RGV)పై ఎన్నో విమర్శలు వచ్చినా, ఆయన దర్శకత్వం వహించడం మాత్రం మానలేదు. ఎన్నో వివాదాస్పద సినిమాలు తీయడంతో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే కెరీర్లో ఎలాగైనా మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన ఆర్జీవీ అందులో భాగంగానే మనోజ్ భాజ్‌పాయ్(Manoj Bajpayee) తో ఓ హార్రర్ కామెడీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఆర్జీవీ ఇప్పటివరకు ఈ జానర్ లో సినిమా చేసింది లేదు. అలాంటి జానర్ లో ఆర్జీవీ సినిమా చేస్తుండటంతో ఆయన్నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ మే భూత్(Police station mein bhooth) అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. జులై 26 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరికి షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో జెనీలియా(Genelia), రాజ్ పాల్ యాదవ్(Rajpal Yadav) కీలక పాత్రల్లో నటించనున్నారు. మరి ఆర్జీవీ ఈ సినిమాతో అయినా కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి.







