వర్మకు షాక్ ఇచ్చిన పవర్‌స్టార్?
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఈమధ్యకాలంలో నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. లాక్డౌన్ అమల్లో ఉన్న టైమ్‌లో కూడా లాక్‌డౌన్‌కు కారణమైన కరోనా వైరస్‌పై సినిమా తీసేశాడు. ఇంకా క్లైమాక్స్, నేక్డ్.. ఇలా సినిమాలు తీసేసి ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నాడు. తాజాగా పవర్‌స్టార్ పేరుతో ఒక సినిమా ఎనౌన్స్ చేయడమే కాకుండా ఆ సినిమాలో పవన్‌కల్యాణ్‌ని పోలిన నటుడి వాకింగ్‌తో కూడిన ఓ చిన్న వీడియోను కూడా షేర్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. పవర్‌స్టార్ పేరుతో సినిమా చేస్తూ పవన్‌కల్యాణ్ గురించి ఏం చెప్పబోతున్నాడు, ఏం చూపించబోతున్నాడు, దానికి పవర్‌స్టార్ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుంది..అసలు ఈ సినిమాను వర్మ ఎప్పుడు మొదలుపెట్టబోతున్నాడు..ఇలా రకరకాల ఆలోచనలు అందరి మనసుల్లోనూ మెదులుతున్నాయి. ఇలా ఉండగానే రామ్‌గోపాల్‌వర్మకు ఓ పెద్ద షాక్ తగిలింది.
`పవర్‌స్టార్` సినిమాలో నటిస్తాడంటూ పరిచయం చేసిన పవన్‌కల్యాణ్‌ను పోలిన నటుడు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాడని తెలిసింది. రామ్‌గోపాల్‌వర్మ వంటి డైరెక్టర్ చేస్తున్న సినిమా నుంచి ఒక నటుడు తప్పుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసే విషయమే. ఈ విషయంలో వర్మ కూడా షాకై ఉంటాడు. అతను ఈ సినిమా నుంచి తప్పుకున్నాడన్న విషయం నిజమేనా? నిజమే అయితే అందుకు కారణాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.













