The Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని “రాజా సాబ్” సినిమా చేశాం
డార్లింగ్ ఫ్యాన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని “రాజా సాబ్” సినిమా చేశాం, ఈ మూవీ క్లైమాక్స్ చూసి మారుతి రైటింగ్ కు ఫ్యాన్ అయ్యాను, సంక్రాంతికి అన్ని మూవీస్ తో పాటు “రాజా సాబ్” కూడా బ్లాక్ బస్టర్ కావాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెబల్ స్టార్ ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్”. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న “రాజా సాబ్” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో “రాజా సాబ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు మహేశ్ ఆచంట మాట్లాడుతూ – నేను 2026లో కనిపించబోయో ఫస్ట్ సినిమా “రాజా సాబ్”. ఈ సినిమాలో నాకు నటించే అవకాశం కల్పించారు మారుతి గారు. ప్రభాస్ అన్న టీ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చారు. వాళ్లద్దరితో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి రుణపడి ఉంటాను. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చే ఫ్యాన్స్ తో రోడ్లన్నీ నిండిపోయాయి. ప్రభాస్ గారి క్రేజ్ అంటే అలా ఉంటుంది. అన్నారు.
లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ – “రాజా సాబ్” చిత్రంతో ఫస్ట్ టైమ్ ప్రభాస్ గారికి పాట రాశాను. ఆ పాటను సర్ ప్రైజ్ ప్యాకేజ్ లా త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ అన్న ఈ పాటలో వేసే స్టెప్స్ స్క్రీన్ మీద చూసేందుకు నేను కూడా మీతో పాటు ఎదురుచూస్తున్నాను. అన్నారు
నటి జరీనా వాహాబ్ మాట్లాడుతూ – నేను 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. రాజా సాబ్ వంటి మంచి సినిమాతో తెలుగులో నటించే అవకాశం కల్పించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మారుతి గారు. ఈ సినిమాలో నటించేప్పుడు మొత్తం టీమ్ అంతా నాకు సపోర్ట్ చేశారు. ప్రభాస్ గారితో నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నేను ఎంతోమంది నటులతో నటించాను గానీ ప్రభాస్ వంటి మంచి మనసున్న వ్యక్తిని చూడలేదు. అతనికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అన్నారు.
నటుడు రోహిత్ మాట్లాడుతూ – నేను బాలీవుడ్ నుంచి వచ్చాను. ఈ ఈవెంట్ కు వచ్చే రోడ్ దగ్గర యూటర్న్ తీసుకునేందుకు గంట టైమ్ పట్టింది. ఇంతమంది అభిమానులు తరలిరావడం నేను ఇప్పటిదాకా చూడలేదు. రెబల్ ఫ్యాన్స్ అందరికీ నా సెల్యూట్. ప్రభాస్ గారి రాజా సాబ్ సినిమాలో నటించడం నాలాంటి నటుల కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుంది. అన్నారు.
నటుడు సప్తగిరి మాట్లాడుతూ – ప్రభాస్ అన్నతో సలార్ మూవీలో యాక్ట్ చేశాను. ఆ సినిమా ఇంటర్వెల్ చూసి 2 వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ చేస్తుందని చెప్పాను. అలాగే జరిగింది. రాజా సాబ్ రిలీజ్ ట్రైలర్ ఇందాకే ప్రొడ్యూసర్ గారి ఫోన్ లో చూశాను. ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమా కూడా తప్పకుండా 2 వేల కోట్ల రూపాయలు వసూళ్లు సాధిస్తుంది. ప్రభాస్ అన్నను మనం వింటేజ్ లుక్ లో ఎలా చూడాలనకున్నామో అలా దర్శకుడు మారుతి గారు ఈ సినిమాలో చూపించారు. ఆయన ఇలా పూలు పట్టుకోవడం, రొమాంటిక్, వింటేజ్ లుక్ లో కనిపించడం మళ్లీ మనం కొన్నేళ్ల దాకా చూడలేం. ఎందుకంటే ఆయన యాక్షన్ మూవీస్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ఈ సినిమాలో మా అందరి కన్నా ప్రభాస్ అన్నే ఎక్కువ మిమ్మల్ని నవ్విస్తాడు. మీతో పాటు నేను కూడా ప్రభాస్ అన్నను చూసేందుకు ఈ ఈవెంట్ కు వచ్చాను. అన్నారు.
నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని మాట్లాడుతూ రాజా సాబ్ సినిమా ఘన విజయం సాధించాలని మారుతి గారికి, విశ్వప్రసాద్ గారికి నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. ప్రభాస్ నాకు బ్రదర్ లాంటి వారు. ఆయన మీ అందరి ప్రేమకు అర్హుడు. ఇంత భారీ సంఖ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ ను చూస్తుంటే హ్యాపీగా ఉంది. అన్నారు.
నటుడు వీటీవీ గణేష్ మాట్లాడుతూ – ఈ రోజు నేను ఈ వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం హీరో విజయ్, డైరెక్టర్ నెల్సన్. వాళ్లు ఇచ్చిన అవకాశంతో బీస్ట్ సినిమాలో ఎవుర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అనే డైలాగ్ చెప్పాను. ఆ ఒక్క డైలాగ్ ఎంతో పాపులర్ అయి నాకు పేరు తీసుకొచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆ ఒక్క డైలాగ్ తో తెచ్చుకున్నావ్ అంటూ మా సప్తగిరి అంటుంటాడు. రాజా సాబ్ సినిమాలో 55 రోజుల పాటు వర్క్ చేశాను. ప్రభాస్ గారితో నటించడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – 2021లో రాజా సాబ్ సినిమాకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత మారుతి చేసిన ఒక మూవీ అనుకున్నంత ఆడలేదు. అప్పుడు ప్రభాస్ గారిని ఇంటికి వెళ్లి మారుతి కలిశారు. బయటకు వచ్చాక మారుతి నాతో ఒకటే చెప్పారు. ఇక నా కెరీర్ లో రాబోయే రెండు మూడు ఏళ్లు నా ఆలోచనల్లో ఒక్క రాజా సాబ్ మాత్రమే ఉంటుంది అన్నారు. ఏం జరిగింది డార్లింగ్ అని అడిగాను. ఆ సినిమా సక్సెస్ కాకుంటే అందులో నీ తప్పు ఏముంది, మనం సినిమా చేస్తున్నామని ప్రభాస్ గారు చెప్పారని మారుతి నాతో అన్నారు. ప్రభాస్ గారు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పరు. ఈ సినిమాకు నేను చేసింది ఉడత సాయమే. ప్రభాస్ గారు కల్మషం లేని వ్యక్తి. ఆయనకు సినిమా మాత్రమే తెలుసు. యూరప్ లో షూటింగ్ చేస్తుంటే ఒక విల్లా మొత్తం తీసుకుని, అందులో ఆయన పర్సనల్ చెఫ్ తో తెలుగు వంటలు చేయించి మాకు భోజనం పెట్టారు. ఇంతమంచి వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడకుండా ఎలా ఉంటాం. ఈ సంక్రాంతి పండక్కి 3గంటల 10 నిమిషాల మాస్ ఎంటర్ టైనర్ థియేటర్స్ లో చూడబోతున్నాం. ప్రతి సంక్రాంతికి కోళ్ల మీద పందేలు వేస్తాం, ఈసారి డైనోసార్ మీద వేయబోతున్నాం. పండక్కి వస్తున్నాం, పండగ చేస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ రిద్ధి కుమార్ మాట్లాడుతూ – రాజా సాబ్ పర్పెక్ట్ ఎంటర్ టైనర్ మూవీ. ప్రభాస్ గారు మనందరికీ డార్లింగ్. ఆయన ఎలా ఉంటారో అలాగే ఈ సినిమాలో మారుతి గారు చూపించబోతున్నారు. ప్రభాస్ గారిలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ ఈ సినిమాలో మీరు చూడొచ్చు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రభాస్ గారిని మరింత ఇష్టపడతారు. మీరంతా రాజా సాబ్ సినిమాను జనవరి 9న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ – నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం, గౌరవం. ప్రభాస్ గారి లాంటి పాన్ ఇండియా స్టార్ సరసన నటిస్తూ, రాజా సాబ్ లాంటి ప్రెస్టీజియస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడతానని ఊహించలేదు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ కు రెబల్ స్టార్, రెబల్ గాడ్. కానీ మా అందరికీ రాజా సాబ్. ఆయన మంచి మనసున్న స్టార్. రాజా సాబ్ సినిమాలో భైరవి క్యారెక్టర్ లో నటించాను. హీరోయిన్స్ కు రొమాన్స్, సాంగ్స్ మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్టర్ మారుతి గారు నాతో ఈ మూవీలో రొమాన్స్, సాంగ్స్ తో పాటు కామెడీ, డ్రామా, యాక్షన్ కూడా చేసే అవకాశం ఇచ్చారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న రాజా సాబ్ మూవీని థియేటర్స్ లో మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ – ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారితో కలిసి సినిమా చేయడం కల నిజమైన అనుభూతి కలిగిస్తోంది. ఆయన ఎంతమంచి వారో మాటల్లో చెప్పలేను. మీ అందరి అభిమానం, ప్రేమతో ఇంకా మరిన్ని విజయాలు ప్రభాస్ గారు అందుకోవాలి. గల్లీలో సిక్స్ కొట్టడం కాదు స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ప్రభాస్ గారి రేంజ్ అది. రాజా సాబ్ లో నటించే అవకాశం కల్పించిన మారుతి గారికి థ్యాంక్స్. సప్తగిరి, వీటీవీ గణేష్..ఇలా వీరందరితో కలిసి నటించడం ఎంతో సరదాగా సాగింది. నా కోయాక్టర్స్ మాళవిక, రిద్ధితో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేను. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ఎంతో సపోర్ట్ చేశారు. తమన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మనమంతా రాజా సాబ్ ను థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం. అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – నేను ఈ వేదిక మీద నిలబడ్డాను అంటే అది మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లే. రాజా సాబ్ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్ గారు, మరొకరు విశ్వప్రసాద్ గారు. విశ్వప్రసాద్ గారు, ఆయన పీపుల్ మీడియా టీమ్ అంతా రాజా సాబ్ కోసం ప్రాణం పెట్టారు. ప్రభాస్ గారు ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటిస్తుండగా, ఈ మారుతి ఆయన దగ్గరకు వెళ్లాడు. రాజా సాబ్ కథ విని ప్రభాస్ గారు చాలా నవ్వుకున్నారు. అయితే ఆయనకు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రపంచమంతా ప్రభాస్ గారు గుర్తింపు తెచ్చుకున్నారు. మేము సౌతాఫ్రికాలో ఒక చిన్న ఊరిలో షూటింగ్ చేస్తుంటే, అక్కడి వారికి కూడా ప్రభాస్ గారు తెలియడం మమ్మల్ని సర్ ప్రైజ్ చేసింది. రాజమౌళి గారు కష్టపడి చేసిన పాన్ ఇండియా ప్రయత్నం ఈ రోజు మా అందరికీ ఉపయోగపడుతోంది. నేను, సుకుమార్, సందీప్ వంగా ..ఇలా ఎంతోమంది డైరెక్టర్స్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాం. మన స్టార్స్ చాలా మంది పాన్ ఇండియాకు రీచ్ అయ్యారు.
ప్రభాస్ గారితో మేము ఏదో సినిమా చేశాం అనిపించుకోకుండా ఒక పెద్ద స్పాన్ మూవీ చేశాం. ఈ జానర్ లో మంచి పొటెన్షియాలిటీ ఉంది. దాన్ని మేము మరో రేంజ్ కు తీసుకెళ్తున్నాం. రాజా సాబ్ కోసం ఎంతోమంది కష్టపడ్డారు. నేను 11 సినిమాలు చేశాను, నువ్వు పెద్ద రేంజ్ దర్శకుడివి కావాలని రెబల్ యూనివర్సిటీలో ప్రభాస్ గారు అవకాశం కల్పించారు. నేను రాశాను, తీశాను కానీ ప్రభాస్ గారు ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్, సినిమాతో ఏకమైన తీరు, ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నా విశ్వప్రసాద్ గారు చాలా ధైర్యంగా రాజా సాబ్ ను తీసుకొస్తున్నారు. అన్ని భాషల్లో రాజా సాబ్ సాధించే విజయం మామూలుగా ఉండదు. నేను నా సినిమాలను ఒక ఆడియెన్ లాగే చూస్తా. ఈ సినిమా సీన్స్ ఆర్ఆర్ చేసిన తర్వాత చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. ప్రభాస్ గారికి ఎంతైనా రుణపడి ఉంటాను. మాటల్లో చెప్పలేను డార్లింగ్. నేను సాధారణంగా కన్నీళ్లు పెట్టుకోను. కానీ ప్రభాస్ గారు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ కు, ఆయన నా ముందు చూస్తూ ఎమోషనల్ అవుతున్నా. ఈ సినిమా మీలో ఎవర్ని ఒక్క సీన్ నిరాశపర్చినా, నా ఇంటి అడ్రెస్ ఇస్తా రండి. అన్నారు.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో బిగ్గెస్ట్ స్టార్ తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. చాలామంది చిన్న సినిమా అనుకున్నారు గానీ మూడేళ్ల కష్టపడి రాజా సాబ్ సినిమా నిర్మించాం. ఇందాక మారుతి గారు చెప్పినట్లు ఏ ఒక్కరినీ కూడా రాజా సాబ్ నిరాశపర్చదు. గ్లోబల్ గా హారర్ ఫాంటసీ జానర్ లో రాజా సాబ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది. మీరంతా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ – నా ఫ్యాన్స్ అందరికీ హాయ్, ఈ మధ్యే జపాన్ ఫ్యాన్స్ ను కలిసినప్పుడు ఇలాగే హ్యాపీగా ఫీలయ్యా. మీ అందరి కోసం కొత్త హెయిర్ స్టైల్ లో వచ్చా. అనిల్ తడానీ నా బ్రదర్ లాంటి వారు. ఆయన నా సినిమాలకు నార్త్ లో సపోర్ట్ చేస్తుంటారు. సంజయ్ దత్ గారు క్లోజ్ షాట్ పెడితే సీన్ మొత్తం తినేస్తారు, ఇది నానమ్మ, మనవడి కథ. జరీనా వాహబ్ గారు నాకు నానమ్మ క్యారెక్టర్ లో నటించారు. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తూ ఉండిపోయా. ఆమె నటనకు ఫ్యాన్ ను అయ్యాను. నాతో పాటు జరీనా గారు కూడా రాజా సాబ్ లో హీరోనే. రిద్ధి, మాళవిక, నిధి ముగ్గురూ బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఈ ముగ్గురు తమ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటారు. ఒక రోజు వేదిక మీద నా స్పీచ్ ఇస్తా, షాకై పోతారు. ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ పెరిగింది. అయినా ఎంతో ధైర్యంగా విశ్వప్రసాద్ గారు సినిమా నిర్మించారు. రాజా సాబ్ కు హీరో విశ్వప్రసాద్ గారే. ఈ రేంజ్ హారర్ ఫాంటసీ సినిమాకు తమన్ మాత్రమే మ్యూజిక్ చేయగలడు అనిపించింది.
తమన్ చేతుల్లో మా సినిమాను పెట్టాం. మా డీవోపీ కార్తీక్ గారు ఎంతో స్పీడ్ గా క్వాలిటీగా మూవీ చేశారు. మీ వల్లే మా సినిమా క్వాలిటీ ఇంత బాగా వచ్చింది. సొలమన్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మూడేళ్ల రాజా సాబ్ స్ట్రెస్, బాధ్యత అన్నీ కలిసి మారుతి గారికి కన్నీళ్లు వచ్చాయి. మారుతి గారిని ఫస్ట్ కలిసినప్పుడు డార్లింగ్ అన్నీ యాక్షన్ మూవీస్ అవుతున్నాయి, మంచి ఎంటర్ టైనింగ్ మూవీ మన ఫ్యాన్స్ కు ఇవ్వాలి అని అన్నాను. హారర్ కామెడీ జానర్ తో ఈ ప్రాజెక్ట్ రెడీ చేశాం. మారుతి గారు రాసిన స్క్రిప్ట్ కు విశ్వప్రసాద్ గారు ఓకే అని చేసుకుంటూ వస్తున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ కు వచ్చేసరికి మారుతి గారి రైటింగ్ కు నేను ఫ్యాన్ అయ్యాను. ఆయన పెన్ తో రాశారా మెషీన్ గన్ తో రాశారా అనే డౌట్ వచ్చింది. హారర్ కామెడీలోనే కాదు ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. మీరు చూసి చెప్పాలి. మనకు 15 ఏళ్ల తర్వాత మారుతి డార్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు. సినిమా చూస్కోండి, సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. సీనియర్స్ సీనియర్సే, వాళ్ల దగ్గరనుంచే మేము నేర్చుకున్నది. సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా రాజా సాబ్ కూడా బ్లాక్ బస్టర్ కావాలి. రేపు ట్రైలర్ వస్తుంది చూడండి. అదిరిపోతుంది. అన్నారు.






