అఖిల్ నెక్ట్స్ లేటుకు కారణాలివే!
ఏజెంట్ సినిమా వచ్చి 8 నెలలవుతున్నా అఖిల్ ఇప్పటివరకు తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. కనీసం దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వలేదు. మీడియా ముందుకొచ్చినా ఎక్కడా మాట్లాడట్లేదు. రీసెంట్ గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మెరిసిన అఖిల్, యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న విషయం తెలిసిందే.
ధీర అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న కొద్దీ అది వెనక్కి వెళ్తూనే ఉంది. దీనికి కారణం బడ్జెట్ అని తెలుస్తోంది. కంటెంట్ ను దృష్టి లో పెట్టుకుని ఈ సినిమాకు వంద కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి యువి నిర్మాతలు రెడీ అయ్యారు. కానీ అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం వస్తోందట.
అందుకే యువి నిర్మాతలు, హోంబలే ఫిల్మ్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుందట. అఖిల్, సలార్ సక్సెస్ పార్టీకి వెళ్లడం వెనుకున్న రీజన్ కూడా ఇదేనని తెలుస్తోంది. దానికి తోడు ఈ సినిమా జానపదం, ఫాంటసీ మిక్స్ చేస్తూ విజువల్ ట్రీట్ గా రూపొందనుందని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న విశ్వంభర కూడా అదే జానర్ కు చెందిన సినిమా కావడంతో అఖిల్ సినిమా స్క్రిప్ట్ ను మరింత మెరుగుదిద్దే పనిలో ఉన్నాడట డైరెక్టర్. ఏదేమైనా సినిమా సినిమాకు ఇంత అఖిల్ ఇంత టైమ్ తీసుకోవడం మాత్రం అక్కినేని అభిమానుల్ని నిరాశకు గురి చేస్తోంది.













