బాలయ్య సినిమాలో అందుకే నటించట్లేదు: విశ్వక్ సేన్
టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు చేసే నటుడిగా అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్. అయితే తను ఒక సినిమాలో నటిస్తుండటం, దాన్నుంచి తప్పుకోవడం గురించి మాత్రం రెగ్యులర్ గా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటుంది. బేబి సినిమా కోసం సాయి రాజేష్ ముందు విశ్వక్ ను అనుకుని సంప్రదించగా, విశ్వక్సేన్ డైరెక్టర్ సాయి రాజేష్ తో వ్యవహరించిన తీరు గురించి ఆ సినిమా రిలీజ్ టైమ్ లో చాలా పెద్ద చర్చే అయింది.
అర్జున్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమాకు ఓకే చెప్పి షూటింగ్ మొదలయ్యాక ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. అది కూడా చాలా పెద్ద చర్చే అయింది. ఇక ఇప్పుడు విశ్వక్ మరో సినిమా నుంచి తప్పుకోవడం నెట్టింట చర్చనీయాంశమైంది. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో ఓ స్పెషల్ పాత్ర కోసం విశ్వక్సేన్ ను సంప్రదించినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి.
బాలయ్య సినిమాలో తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనని కానీ తాను ఆ పాత్ర చేయనని చెప్పినట్లు విశ్వక్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. బాలయ్య సినిమాలో తాను చేస్తే చాలా ప్రత్యేకమైన, బాగా ప్రాధాన్యమున్న పాత్రే చేయాలనుకున్నట్లు, తనకు ఆఫర్ వచ్చింది ఆ స్థాయి పాత్ర కాకపోవడంతోనే ఆ సినిమాలో నటించలేకపోయినట్లు విశ్వక్ తెలిపాడు. కానీ భవిష్యత్తులో మాత్రం బాలయ్యతో కలిసి కచ్ఛితంగా నటిస్తానని విశ్వక్ అన్నాడు.













