చంద్రముఖి2 పోస్ట్‌పోన్ వెనుకున్న రీజన్
రాఘవ లారెన్స్ హీరోగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా చంద్రముఖి2. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చంద్రముఖికి సీక్వెల్‌గా రానుంది. అయితే ఈ సినిమాను మొదట్లో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైమ్ లో టీమ్ సినిమాను పోస్ట్‌పోన్ చేసింది.
ఎప్పటికి సినిమా పోస్ట్ పోన్ అయిందని ముందు చెప్పకపోయినా, తర్వాత ఈ సినిమా సెప్టెంబర్ 28కి రిలీజ్ అవుతుందని ప్రకటించారు. సలార్ సినిమా పోస్ట్ పోన్ అవడంతో ఈ వీకెండ్ మొత్తం బాగా కలిసొస్తుందని సినిమాను పోస్ట్ పోన్ చేశారనుకున్నారంతా. కానీ చంద్రముఖి2 సినిమా పోస్ట్ పోన్ అవడానికి అసలు రీజన్ వేరని డైరెక్టర్ పి. వాసు తెలిపాడు.
రిలీజ్ దగ్గర పడుతున్న టైమ్ లో సినిమాకు సంబంధించిన వీఎఫెక్స్ కంటెంట్ పెద్ద మొత్తంలో కనిపించకుండా పోయిందని, దీంతో కంగారుపడిన టీమ్, సినిమాను వాయిదా వేసినట్లు చెప్పాడు. ఓ మెయిన్ సీన్లో వచ్చే వీఎఫెక్స్ కు సంబంధించిన 480 షాట్స్ కనిపించకుండా పోయాయని, దీని కోసం 150 మంది టెక్నీషియన్స్ పని చేస్తున్నారని, అలాంటి టైమ్ లో కంటెంట్ కనిపించకుండా పోవడంతో ఏం చేయాలో తెలియక సినిమాను వాయిదా వేశామని తెలిపాడు. చివరకు కంటెంట్ మొత్తం రీట్రైవ్ చేయడంతో టీమ్ ఊపిరి పీల్చుకుందని, అంతే తప్ప తమ సినిమాను మరో సినిమాకు పోటీగా రిలీజ్ చేయాలని కానీ, వేరే డేట్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని కానీ తాము అనుకోలేదని వాసు వెల్లడించాడు.













