ఫ్లాపుల్లో ప్రొడ్యూసర్ రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటివరకు తన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ రవితేజకు షాకిస్తూనే ఉన్నాయి. రావణాసుర సినిమాకు కూడా రవితేజ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయింది.
తర్వాత కార్తీక్ రత్నంతో పాటూ ఎక్కువ మంది కమెడియన్లను కాస్టింగ్ గా పెట్టి తీసిన ఛాంగురే బంగారు రాజా బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోయింది. కంటెంట్ లో మంచి పాయింట్ ఉన్నప్పటికీ రైటింగ్, డైరెక్షన్ వల్ల ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా రవితేజ బ్యానర్ నుంచి వచ్చిన సుందరం మాస్టర్ సినిమా పరిస్థితి కూడా అంతే అని కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి.
సుందరం మాస్టర్ కు మంచి టాక్ రాకపోగా ముందు నుంచీ ఈ సినిమాపై ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. హర్ష లాంటి యాక్టర్ ను పెట్టుకుని ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ సందేశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో జనాలకు అది రుచించలేదు. దీంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ లిస్ట్ లోకే వెళ్లేట్లనిపిస్తుంది. డబ్బు పరంగా ఈ సినిమాల వల్ల రవితేజకు పెద్దగా లాస్ ఉండదు. ఎలాగూ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ రూపంలో అవి వచ్చేస్తాయి కానీ రవితేజ బ్యానర్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోతుంది. రవితేజ ఓ సినిమాను డబ్బులు పెట్టి మరీ నిర్మిస్తున్నాడంటే ఆడియన్స్ లో ఓ రకమైన అంచనాలుంటాయి. ఇలాంటి సినిమాలను చేస్తే ఆడియన్స్ కు ఆ నమ్మకం పోతుంది. కాబట్టి ఇకనైనా రవితేజ కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.













