సన్నీ డియోల్ తో రవితేజ కథ
ఈ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో అట్టహాసంగా రవితేజ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ లాంటి హీరోతో మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టి చేయడం రిస్క్ అని భావించిన నిర్మాతలు ఈ సినిమాను తాత్కాలికంగా ఆపివేసినట్లు తెలుస్తోంది. కానీ నిర్మాతల నుంచి దీనికి సంబంధించిన క్లారిటీ మాత్రం రాలేదు.
ఇప్పుడు రవితేజ కోసం గోపీచంద్ మలినేని రాసుకున్న కథ సడెన్ గా చేతులు మారి బాలీవుడ్ కు వెళ్లిందని తెలుస్తోంది. ఈ ఇయర్ లో బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన గదర్2 హీరో సన్నీ డియోల్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి మైత్రీ నిర్మాతలు రెడీ అయ్యారని టాక్. ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ దీనికి సంబంధించి చర్చలు ఇప్పటికే ముంబైలో జరిగాయని తెలుస్తోంది.
మంచి పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ రెడీ చేసుకున్న స్క్రిప్ట్ వినగానే బాబీ డియోల్ ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. ఎప్పట్నుంచో బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంటర్ అవాలని చూస్తున్న మైత్రీకి ఇది మంచి కాంబో కానుంది. ఈ కాంబో నిజమైతే మాత్రం ఇది గోపీచంద్ కెరీర్ కు మంచి బ్రేక్ కానుంది. బాలీవుడ్ లో మంచి హిట్ పడితే మాత్రం తర్వాత తన కెరీర్ ఎక్కడికో వెళ్లడం ఖాయం.













