క్యాచీ టైటిల్ను పట్టేసిన రవితేజ
ఈ నెల 15న మిస్టర్ బచ్చన్ తో ఆడియన్స్ ముందుకు రానున్న రవితేజ తన 75వ సినిమాను భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈయన గతేడాది వచ్చిన సూపర్ హిట్ మూవీ సామజవరగమనకు రైటర్ గా పని చేశాడు. ఇప్పుడు రవితేజతో చాలా కొత్త కథతో భాను సినిమా చేస్తున్నట్లు యూనిట్ సభ్యులంటున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాకు కోహినూర్ అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీన్ని వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు కానీ త్వరలో దీన్నే అఫీషియల్ టైటిల్ గా అనౌన్స్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మాస్ టైటిల్స్, క్యాచీ టైటిల్స్ తో రవితేజ నుంచి వచ్చిన సినిమాలన్నీ హిట్ గా నిలిచినవే.
దాన్ని బట్టి చూసుకుంటే కోహినూర్ టైటిల్ వినడానికి బాగుంది కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. దీంతో రవితేజ భలే టైటిల్ ను పట్టేశాడే అని అప్పుడే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ చాలా పట్టుదలతో ఉన్నారు. దానికోసమే షూటింగ్ ను కూడా గ్యాప్ లేకుండా జరుపుతూ పూర్తి చేస్తున్నారు. సంక్రాంతికి భారీ ఎత్తున పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమాను రిలీజ్ చేయాల్సిందేనని నిర్మాత నాగవంశీ పట్టుబట్టి కూర్చున్నాడు.













