Ravi Teja: 2026లో రవితేజ రెండు కొత్త సినిమాలు
రవితేజ(raviteja) హీరోగా నటించిన మాస్ జాతర(Mass jathara) సినిమా ఈ నెల 27న రిలీజవాల్సింది కానీ ఇప్పుడా సినిమా ఆగస్ట్ నుంచి వాయిదా పడిందని తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం కిషోర్ తిరుమల(kishore tirumala) దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్న రవితేజ ఈ ఇయర్ ఎండింగ్ కు దాన్ని పూర్తి చేయనున్నాడు.
ఇదిలా ఉంటే రవితేజ 2026 లో ఓ రెండు సినిమాలను చేయనున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి శివ నిర్వాణ(Siva Nirvana) దర్శకత్వంలో అని తెలుస్తోంది. ఖుషి(Kushi) సినిమా ఫ్లాపుతో శివ నిర్వాణకు హీరో దొరకడం కాస్త కష్టంగా మారగా, ఆఖరికి రవితేజను తన కథతో మెప్పించాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది.
శివ నిర్వాణ సినిమాతో పాటూ యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep raj) చెప్పిన ఓ ఇంట్రెస్టింగ్ కథకు కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గత కొంతకాలంగా డిస్కషన్స్ లో ఉండగా, ఇప్పుడు ఆ సినిమా ఓకే అయినట్టు తెలుస్తోంది. నెక్ట్స్ ఇయర్ మిడిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం.







