రవితేజ తెలివైన నిర్ణయం
సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో విన్నర్ ఎవరన్నది తేలిపోయింది. ఆడియన్స్ అందరూ హను మాన్ ని యూనానిమస్ విన్నర్ గా తీర్పిచ్చారు. ఈ సంక్రాంతికి మామూలుగా అయితే రిలీజైన సినిమాలతో పాటూ రవితేజ హీరోగా నటించిన ఈగల్ కూడా రిలీజ్ కావాల్సింది. కానీ రవితేజ పట్టుబట్టడంతో ఈగల్ వాయిదా పడింది.
రవితేజ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడందరూ మెచ్చుకుంటున్నారు. ఎంతో తెలివిగా ఈ రేసు నుంచి రవితేజ తన సినిమాను తప్పించాడని లేకపోతే కలెక్షన్ల పరంగా సినిమాకు ఇబ్బందులెదురయ్యేవంటున్నారు. నిజానికి జనవరి ఫస్ట్ వీక్ వరకు ఈగల్ నిర్మాతలు థియేటర్లు ఎన్ని దొరికినా సరే సినిమాను వాయిదా వేయమని మొండిగా కూర్చున్నారు. ఆఖరికి నిర్మాత మండలి జోక్యంతో మనసు మార్చుకున్నారు.
ఒకవేళ అలా కాకుండా ఈ పండగ బరిలో ఈగల్ కూడా రిలీజై ఉంటే, సైంధవ్ మూవీలానే ఈ సినిమా కూడా ఇబ్బందులు పడేది. సైంధవ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఆడియన్స్ కు ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు. ఈగల్ కూడా కొంచెం అలాంటి సీరియస్ సినిమానే కాబట్టి సంక్రాంతి ప్రేక్షకులు ఈ సినిమాను కూడా సైంధవ్ లానే ట్రీట్ చేసేవాళ్లు. కాబట్టి రవితేజ తన డెసిషన్ తో ఈగల్ ను వాయిదా వేసి అందర్నీ సేఫ్ చేశాడు.













