ప్రయోగాలు ఆపని రవితేజ
ఎప్పుడూ కమర్షియల్ సినిమాలే చేసే రవితేజ, ఇప్పుడు వాటికి దూరంగా బయోపిక్స్, యాక్షన్ ఎంటర్టైనర్లు చేస్తున్నాడు. అంతేకాదు, ఇకపై కూడా రవితేజ అలాంటి ప్రయత్నాలే చేస్తున్నట్లు టాక్. జనవరిలో రానున్న రవితేజ మూవీ ఈగల్ కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మే. ఈగల్ తర్వాత కూడా రవితేజ కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
అందులో ఒక సినిమా గురించి మాత్రం ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బురు రవితేజకు ఒక లైన్ చెప్పగా, ఆ లైన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించి, ఫుల్ నెరేషన్ అడిగాడట. ఈ సినిమా లెనిన్ అనే టైటిల్‌తో 90స్ బ్యాక్ డ్రాప్లో చాలా డిఫరెంట్ ఉంటుందని తెలుస్తోంది.
రవితేజకు ఫుల్ నెరేషన్ కూడా నచ్చితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.లెనిన్ అనే టైటిల్ కూడా చాలా ఆలోచించి మరీ పెట్టారట. ఈ సినిమా కథపై మురళి కిషోర్ చాలా కాలంగా వర్క్ చేస్తున్నాడట. మరి ఈ సినిమా ఓకే అయితే నిర్మాత ఎవరుంటారు? గోపీచంద్ సినిమా తర్వాత ఈ సినిమా ఉండే అవకాశముంది. మరో వైపు అనిల్ రావిపూడితో కూడా రవితేజ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలొస్తున్నాయి. మరి ఈ రెండింటిలో రవితేజ ముందుగా ఏ సినిమాకు ఓటేస్తాడో చూడాలి.













