మరోసారి పోలీస్ పాత్రలో రవితేజ
రవితేజ మరోసారి పోలీస్ అవతారమెత్తబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది. బి.మధు నిర్మిస్తున్నారు. నవంబరులో ప్రారంభం కానున్న ఈ సినిమాలో రవితేజ శక్తిమంతమైన పోలీస్ అధికారి పాత్రలో నటించబోతున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. రవితేజ నటిస్తున్న 66వ చిత్రమిది. ఆయన శైలికి తగ్గట్టుగా శక్తివంతమైన కథని సిద్ధం చేస్తున్నారు గోపీచంద్ మలినేని., ఆయన డాన్‌శీను, బలుపు తర్వాత రవితేజతో చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగట్టుగానే సినిమా రూపొందబోతోందని చిత్రవర్గాలు తెలిపాయి.













