Ravi Mohan: మెగా ఫోన్ పట్టనున్న కోలీవుడ్ నటుడు
కోలీవుడ్ స్టార్ నటుడు జయం రవి(jayam ravi) ఇప్పుడు రవిమోహన్(ravi mohan) గా మారిన విషయం తెలిసిందే. నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన రవి మోహన్ ఇప్పుడు నిర్మాతగా మారారు. రీసెంట్ గా సొంత నిర్మాణ సంస్థ రవిమోహన్ స్టూడియోస్(Ravi mohan studios) ను స్టార్ట్ చేస్తూ ఓ ఈవెంట్ ను నిర్వహించగా, ఆ ఈవెంట్ కు కార్తీ(Karthi), శ్రద్ధా శ్రీనాథ్(Sraddha Srinadh), శివ కార్తికేయన్(Siva Karthikeyan), శివ రాజ్‌కుమార్(Siva Rajkumar) అటెండ్ అయ్యారు.
ఆ కార్యక్రమంలో రవి మోహన్ స్టూడియోస్ లో మొదటి సినిమాగా బ్రో కోడ్(Bro Code) అనే సినిమా వస్తుందని అధికారికంగా వెల్లడించగా ఆ మూవీలో రవి మోహన్, ఎస్‌జె సూర్య(SJ Surya) నటించనున్నారు. బ్రో కోడ్ సినిమాకు కార్తీక్ యోగి(Karthik yogi) దర్శకత్వం వహించనుండగా ఆ సినిమాతో పాటూ రవి మోహన్ కూడా డైరెక్టర్ గా అరంగేట్రం ఇవ్వాలనుకుంటున్నట్టు వెల్లడించారు.
రవిమోహన్ దర్శకత్వం వహించే సినిమా కూడా తన బ్యానర్ లో రూపొందనుండగా ఈ సినిమాలో యోగిబాబు(Yogi Babu) ప్రధాన పాత్రలో నటించనున్నారు. యాన్ ఆర్టినరీ మ్యాన్(An Ordinary Man) అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే డైరెక్టర్ గా రవి మోహన్ కు ఇదే మొదటి సినిమా. కొత్త బ్యానర్ ను మొదలుపెట్టడమే కాకుండా అందులో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేసి రవి మోహన్ చాలా స్పీడుగా మీదున్నారు.







