ఇందిరాగాంధీ పాత్రలో రవీనాటాండన్ ?
యష్ కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ దేశ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. కోలార్ గోల్డ్ మాఫియా నేపథ్యంలో రూపొందించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కేజీఎఫ్-2 పేరుతో రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో 70వ దశకం నాటి సన్నివేశాల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేసిన రోజుల్ని చూపించబోతున్నారు. ఈ సినిమా లోని కీలకమైన ఎపిసోడ్ నాటి ప్రధాని ఇందిరాగాంధీ చుట్టూ నడుస్తుందట. ఈ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటి రవీనాటాండన్ను ఎంపిక చేస్తున్నారని తెలిసింది. కథాగమనంలో ఇందిరాగాంధీ పాత్ర కీలకం కావడంతో రవీనాటాండన్ ఈ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. ప్రశాంత్‌నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.













