రష్మిక భలే రెస్పాండ్ అయిందే!
ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఏం మాట్లాడాలన్నా సెలెబ్రిటీలు చాలా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. చిన్న మాట నోరు జారినా దాన్ని చీల్చి చెండాడేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. కొన్ని సిట్యుయేషన్స్ లో అసలు వాళ్లు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేకపోయినా దాన్ని భూతద్దంలో పెట్టి చూసి వివాదాస్పదం చేస్తుంటారు.
రీసెంట్గా ఐశ్వర్యా రాజేష్, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పుష్ప మూవీలో శ్రీ వల్లి క్యారెక్టర్ తనకు బాగా సెట్ అవుతుందని చెప్పింది. అంతే సోషల్ మీడియాలో మాత్రం దాన్ని వేరేలా మార్చి తానైతే శ్రీవల్లి క్యారెక్టర్ ని రష్మిక కంటే బాగా చేసేదాన్నని ఐశ్వర్య చెప్పినట్లు ప్రచారం చేశారు. దీంతో హర్ట్ అయిన రష్మిక ఫ్యాన్స్ ఐశ్వర్య ను టార్గెట్ చేయడంతో ఆమె తను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మీడియాకు నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది.
రష్మికను తక్కువ చేసేలా తాను మాట్లాడలేదని, ఆమె పట్ల తనకు ఎంతో రెస్పెక్ట్ ఉందని, శ్రీవల్లి క్యారెక్టర్ తనకు నచ్చిందని, ఆ పాత్ర తనకు బాగా సూటవుతుందని మాత్రమే అన్నట్లు నోట్ లో పేర్కొంది. అయితే ఈ వివాదం గురించి కొంచెం లేట్ గా తెలుసుకున్న రష్మిక, ఆ నోట్ మీద ట్విట్టర్ లో రెస్పాండ్ అయింది. హాయ్ లవ్.. నేనిప్పుడే ఇది చూశా. నీ ఉద్దేశమేంటో నాకు బాగా తెలుసు. మన గురించి మనం ఇలా వివరణ ఇచ్చుకునే పన్లేదు. నీ పట్ల గౌరవం, ప్రేమ మాత్రమే నాకున్నాయి. నీ ఫర్హానా మూవీకి కంగ్రాట్యులేషన్ అని హుందాగా రిప్లై ఇచ్చింది రష్మిక.
తన వ్యాఖ్యలపై ఐశ్వర్య రెస్పాండ్ అయిన తీరు, దానికి రష్మిక స్పందించిన వైనం రెండూ హుందాగా ఉండటంతో ఆ ఇద్దరు హీరోయిన్లను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం పుష్ప2 సినిమాతో పాటూ తెలుగులో మరో రెండు సినిమాలతో బిజీగా ఉండగా, ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాలతో బిజీగా ఉంది.













