Rashmika Mandanna: ఎమోషన్స్ ను బయటకు చూపిస్తే వీక్నెస్ అనుకుంటారు
ఛలో(Chalo) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక(Rashmika) మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుని వరుస ఆఫర్లతో దూసుకెళ్తూ ఇప్పుడు నేషనల్ క్రష్ గా ఓ వెలుగు వెలుగుతోంది. పుష్ప2(pushpa2), కుబేర(Kuberaa) సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. అందులో భాగంగానే రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది.
వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేషనల్ క్రష్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తానొక నటినని, తన పర్సనల్ లైఫ్ కు, ప్రొఫెషనల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుందని, తాను ఇంట్లో ఎలా ఉంటానో చూస్తే షాకవుతారని, ఎంతో ఎమోషనల్ పర్సన్ అని కాకపోతే ఆ ఎమోషన్స్ ను బయటకు చూపించనని రష్మిక తెలిపింది.
ఎమోషన్స్ ను బయటకు చూపిస్తే తన దయా గుణాన్ని వీక్నెస్ అనుకుంటారని, మరికొంత మంది కెమెరాల కోసమే తాను ఇదంతా చేస్తుందనుకుంటాని, వాస్తవానికి మనం ఎంత నిజాయితీగా ఉంటే మనపై అంత నెగిటివిటీ వస్తుందని, అందుకే ఎమోషన్స్ ను బయటకు చూపించనని చెప్పిన రష్మిక నెగిటివిటీ వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి తాను చాలా కష్టపడతానని వెల్లడించింది.







